గిరిజనుల కోసం రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని గిరిజన సలహా మండలి తీర్మానించింది. అలాగే ఐదు జిల్లాల పరిధిలో గుర్తించిన 554 గ్రామాలను ఏజెన్సీ ప్రాంత పరిధిలోకి తీసుకురావాలని తీర్మానించింది. ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన సలహా మండలి సమావేశంలో వివిధ తీర్మానాలు చేశారు. పోడు భూముల పట్టాలు పొందని గిరిజన రైతులకు వచ్చే ఉగాది లోపు పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని మండలి కోరింది. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల అనుమతిని రద్దు చేసినందుకు సమావేశంలో ముఖ్యమంత్రికి మండలి ధన్యవాదాలు తెలిపింది.
'రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు తీర్మానం' - ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి తాజా వార్తలు
ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అధ్యక్షతన గిరిజన సలహా మండలి భేటీ అయింది. రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. 5 జిల్లాల పరిధిలోని 554 గ్రామాలను ఏజెన్సీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. బాక్సైట్ తవ్వకాల అనుమతి రద్దు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
tribal-welfare-minister-review-meeting