ఫిట్‌నెస్ లేకపోతే కఠినచర్యలు: పేర్ని నాని
పాఠశాలలు ఫిట్‌నెస్ లేని బస్సులను తిప్పితే కఠినచర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఏటా ప్రైవేటు పాఠశాల బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు తప్పక చేయించాలని, ఫిట్‌నెస్ లేని బస్సుల్లో పిల్లలను తరలిస్తే బస్సులు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఏటా ప్రైవేటు పాఠశాల బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు తప్పక చేయించాలని, ఫిట్‌నెస్ లేని బస్సుల్లో పిల్లలను తరలిస్తే బస్సులు సీజ్ చేస్తామని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రవాణా శాఖలో ఐదు వందల ఖాళీలు ఉన్నాయని తెలియజేసిన మంత్రి.... సీఎం జగన్‌తో చర్చించి ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. రవాణా శాఖ నుంచి ఏటా 4 వేల కోట్ల రూపాయల ఆదాయం పెంచాలన్నది తమ లక్ష్యమన్నారు. పారదర్శకత కోసం సీఎం జగన్ మంత్రుల ఫోన్ నెంబర్లను ఆన్‌లైన్‌లో ఉంచారని, తమ ఫోన్లకు రోజుకు 12 నుంచి 30 వరకు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ప్రజలకు పారదర్శక, అవినీతి రహిత పాలన అందిస్తామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.