రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు ఏ మాత్రం పెరగలేదని ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్కో సీఎండీ ఎన్. శ్రీకాంత్ వెల్లడించారు. కొత్త టారిఫ్ ఆర్డర్ ప్రకారం 500 యూనిట్లు దాటితేనే అదనంగా 90 పైసలు పెరిగిందని వివరించారు. ప్రస్తుతం టారిఫ్ ఆర్డరుతో సంబంధం లేకుండా బిల్లింగ్ చేశామనేది అవాస్తవమని చెప్పారు.
వినియోగదారుల బిల్లులకు సంబంధించిన వివరాలన్నీ ఆన్లైన్లో ఉంచుతున్నామని అన్నారు. గతేడాది విద్యుత్ టారిఫ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో.. ఈ ఆర్థిక సంవత్సరం అదే అమల్లో ఉందని తెలిపారు. విద్యుత్ బిల్లుల విషయంలో ఏమైనా అనుమానాలుంటే 1912కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని అన్నారు.