రాష్ట్రంలో మూడు కొత్త అంతర్జాతీయ స్టేడియంలు - MINISTER
తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణంలో...... మూడు కొత్త అంతర్జాతీయ స్టేడియంల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ap minister
రాష్ట్రంలో మూడు కొత్త అంతర్జాతీయ స్టేడియంలు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో 13 జిల్లాల క్రీడా అధికారులతో సమావేశం నిర్వహించిన క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు.. ప్రతిభ ఉన్న క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాన్ని..... అమలు చేస్తామని ప్రకటించారు. క్రీడల్లో విద్యార్ధుల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్రస్ధాయిలో 12 మెగా ఈవెంట్స్ నిర్వహించాలని అధికారులకు సూచనలు ఇచ్చామని తెలిపారు.