స్పీకర్ పరిధిలోకి రాని అంశంపై వైకాపా ఎంపీలు అనర్హత పిటిషన్ ఇవ్వడం.. చట్టంపై వారికున్న అజ్ఞానాన్ని బయటపెట్టిందని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్ ఒక డ్రామా అని విమర్శించారు. అనర్హతకు అవకాశమే లేదని స్పష్టం చేశారు.
'వైకాపా ఎంపీలు అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు'
రఘురామకృష్ణరాజుపై లోక్‌సభ స్పీకర్‌కు వైకాపా ఎంపీలు అనర్హత వేటు పిటిషన్ ఇవ్వటం ఓ నాటకమని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్‌కు అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు.
yanamala ramakrishnudu
సభ వెలుపల జరిగిన అంశాల ఆధారంగా అనర్హత వేటు పడదు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఇది స్పష్టంగా చెప్పారు. విప్‌ను ధిక్కరించి ఓటు వేసినా, సభకు గైర్హాజరు అయితే అనర్హత పరిధిలోకి వస్తారు. ఎంపీ రఘరామకృష్ణరాజు విషయంలో ఈ రెండూ జరగలేదు -యనమల రామకృష్ణుడు