కృష్ణా జిల్లా మంగాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ తిరగబడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. దాసూళ్లపాలెంకి చెందిన వింజమూరు వంశీ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మట్టి కోసం ట్రాక్టర్ తీసుకొని వెళ్లిన క్రమంలో.. మంగాపురం వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి తిరిగబడింది. ఘటనలో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రెండు నెలల క్రితం మృతుడి సోదరుడు కూడా మరణించడంతో వారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ట్రాక్టర్ తిరగబడిన ఘటనలో యువకుడు మృతి - ట్రాక్టర్ తిరగబడిన ఘటనలో యువకుడు మృతి తాజా వార్తలు
ట్రాక్టర్ తిరగబడిన ఓ యువకుడు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా మంగాపురం వద్ద చోటుచేసుకుంది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ట్రాక్టర్ తిరగబడిన ఘటనలో యువకుడు మృతి