ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూముల్ని లాక్కోవద్దంటూ అధికారుల్ని అడ్డుకున్న గ్రామస్తులు! - కొక్కిలిగడ్డ వార్తలు

కృష్ణా నది ఒడ్డున ఉన్నాం.. మా భూముల్ని లాక్కోవద్దు... మాకు నది పక్కన ఇళ్ళ స్థలాలు ఇవ్వొద్దు అంటూ కృష్ణా జిల్లా కొక్కిలిగడ్డ ప్రజలు వాపోతున్నారు. సొసైటీ భూముల్ని తీసుకోవద్దంటూ.. భూముల్ని కొలవడానికి వెళ్లిన రెవిన్యూ అధికారులను అక్కడి గ్రామస్తులు అడ్డగించారు.

The villagers stop to officers for seize the land and giving house lands besides krishna river at kokkiligadda in krishna
The villagers stop to officers for seize the land and giving house lands besides krishna river at kokkiligadda in krishna

By

Published : May 28, 2020, 10:16 AM IST

కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ, కొత్తపాలెం గ్రామంలో కృష్ణానది ఒడ్డున సాగుచేసుకుంటున్న సొసైటీ భూములు తీసుకుని... అదే గ్రామంలోని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వడాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు.

భూముల్ని లాక్కోవద్దంటూ అధికారుల్ని అడ్డుకున్న గ్రాస్తులు

కృష్ణానది ఒడ్డున ఉన్న సుమారు రెండు ఎకరాలు భూమిలో.. 35 మంది సొసైటీగా ఏర్పడి పశువుల మేతను పెంచుకుంటున్నారు. ఇదే గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం అర్జీ పెట్టుకున్న సుమారు 72 మందికి ఆ భూమిని కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

నది ఒడ్డున ఇళ్ల స్థలాలు ఇస్తే.. వరదలు వచ్చినప్పుడు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ప్రమాదంలేని కాలువ, కరకట్టకు ఆవతలవైపు ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు. దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములను.. ఇళ్ల స్థలాలకు తీసుకోవద్దంటూ కొక్కిలిగడ్డ గ్రామస్థులు.. భూములు కొలిచేందుకు వెళ్లిన రెవిన్యూ అధికారులను అడ్డగించారు. అవనిగడ్డ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ సురేష్ గ్రామస్తులను అడ్డుకోని అక్కడ నుంచి పంపించేశారు.

ఇదీ చదవండి:అగ్నిప్రమాదంలో చెప్పుల దుకాణం ఆహుతి

ABOUT THE AUTHOR

...view details