An open letter by tdp leaders : ‘‘జగనాసుర రక్త చరిత్ర’’ పుస్తకంలో సీఎం జగన్ కుటుంబసభ్యులపై లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదని తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి టీడీపీ నేతలు కాలవ శ్రీనివాసులు, ఆర్ శ్రీనివాసుల రెడ్డి, ఎన్.అమర్నాథ్ రెడ్డి, బి.టెక్ రవి, బి.సి.జనార్ధన్ రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు బహిరంగ లేఖ రాశారు.
ఉన్నతాధికారులను మార్చడం నిజం కాదా..‘‘జగనాసుర రక్త చరిత్ర’’ పుస్తకంపైసాక్షి పత్రిక వక్రీకరించిన ప్రశ్నలకు ఈ లేఖలో సమాధానాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వివేకా హత్య జరిగింది మార్చి 15, ఎన్నికల షెడ్యూల్ మార్చి 10నే వచ్చింది అని..., వివేకా హత్య నాటికి చంద్రబాబు ఆపద్దర్మ ముఖ్యమంత్రి అనేది నిజం కాదా అని నిలదీశారు. ఎన్నికల కమిషన్ కు జగన్ రెడ్డి ఫిర్యాదు చేసి సీఎస్ సహా ఉన్నతాధికారుల్ని మార్చడం నిజం కాదా చెప్పాలన్నారు. హత్యతో సంబంధం లేకుంటే 21 మార్చిన గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆనవాళ్లు ధ్వంసం చేశారు..అవినాశ్ రెడ్డి జగన్ రెడ్డికి చేసిన ఫోన్లపై అభూత కల్పన అనడం పచ్చి అబద్దం అని దుయ్యబట్టారు. భారతి రెడ్డి సహాయకుడు నవీన్, జగన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ ను సీబీఐ ఎందుకు విచారించిందని ప్రశ్నించారు. తప్పు లేనపుడు ఆరోజు ఫోన్ కాల్ డేటా బయటపెట్టమని సీబీఐని ఎందుకు కోరడం లేదో జగన్ చెప్పాలన్నారు. వివేకా చనిపోయాడని ఉదయ్ కుమార్ రాత్రి.3.30కి తన తల్లికి ఎలా చెప్పాడని నిలదీశారు. వివేకా హత్య జరిగిన తర్వాతి రోజే కడప ఎంపీ అభ్యర్ధిగా అవినాశ్ ను ప్రకటించడం నిజమా కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. హత్యకు ముందే ప్రకటించినట్లైతే మరోసారి మార్చి 16న ప్రకటించాల్సిన అవసరం ఏమిటన్నారు. హత్యలో పాత్ర లేకుంటే హత్యాస్థలిలో ఆనవాళ్లను అవినాశ్ రెడ్డి ఎందుకు ధ్వంసం చేయించారని...., కుట్లు వేయించి, ఫ్రీజర్లో పెట్టి ఖననానికి ఎందుకు ఏర్పాట్లు చేశారని ప్రశ్నలు సంధించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి రక్తపు వాంతులకు దారుణ హత్యకు తేడా తెలియనంత అమాయకుడా అని ఎద్దేవా చేశారు.