Localbody Elections in ap : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 7 ఎంపీపీ అధ్యక్షులు, 11 ఎంపీపీ ఉపాధ్యక్షులు, 6 కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నిక నిర్వహించాలని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీ చేశారు. మండల పరిషత్ ప్రత్యేక సమావేశం కోసం జనవరి 30వ తేదీలోగా నోటీసు జారీ చేయాల్సిందిగా ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి మూడో తేదీ ఉదయం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించనున్నట్టు కమిషన్ పేర్కొంది.
ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల - ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్
Localbody Elections: ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నిక నిర్వహించాల్సిందిగా స్పష్టం చేసింది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్
ఎన్నికలు ఇక్కడే : అనకాపల్లి జిల్లాలోని కోటవురట్ల, ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం, నెల్లూరులోని జలదంకి, తిరుపతిలోని చిల్లకూర్, చిత్తూరు, కర్నూలు జిల్లా మడికెరలో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక చేపట్టనున్నారు. ఎస్.రాయవరం, పిడుగురాళ్ల, సంతమాగులూరు, ఆలూర్, విడపనకల్లు, చెన్నేకొత్తపల్లి మండలాల అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు.
ఇవీ చదవండి :