ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో బస్సు సర్వీసులు పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. సోమవారం నుంచి కర్ఫ్యూ సమయం సడలింపులు ఇస్తున్నందున..... ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు బస్సు సర్వీసులు నడపాలని ...పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులు పెంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు పగటి పూట నడిచే దూరప్రాంత సర్వీసులను పెంచనున్నారు. హైదరాబాద్ సహా చెన్నై ,బెంగళూరు తదితర ప్రాంతాలకు ఆయా రాష్ట్రాల్లో లాక్ డౌన్ పరిస్థితుల దృష్ట్యా అనుమతులు ఇచ్చాకే బస్సులు నడపనున్నారు దూరప్రాంత సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ ను పునరుద్ధరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. నేటి నుంచి బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బస్సులు తిప్పాలని ఎండీ ఆదేశాల్లో తెలిపారు.
సోమవారం నుంచి బస్సు సర్వీసులు పెంచాలని ఆర్టీసీ నిర్ణయం - APSRTC NEWS
రాష్ట్రంలో బస్సు సర్వీసులు పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు బస్సు సర్వీసులు నడపాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం నుంచి కర్ఫ్యూ సమయం సడలింపుతో పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులు పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది.
సోమవారం నుంచి బస్సు సర్వీసులు పెంచాలని ఆర్టీసీ నిర్ణయం