పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో విస్తరించిన కొల్లేరు... ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. కొందరు స్వార్థ ప్రయోజనాలు, మానవ తప్పిదాలు.... వెరసి కొల్లేరు.. ఉప్పునీటి సరస్సుగా మారుతోంది. 50 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న కొల్లేరులో 3 టీఎంసీలైనా నిలవలేకపోతుండటం... పరిస్థితికి అద్దం పడుతోంది. చేపలు, రొయ్యల మాఫియా... కొల్లేరును ఆక్రమించాక.... ఉప్పునీటి శాతం పెరిగి.... జీవవైవిధ్యం దెబ్బతింది. సముద్రం పోట్లకు.... ఉప్పునీరు కొల్లేరులో కలుస్తోంది. ఈ కారణంగా.. గొంతు తడుపుకోవడానికి నీళ్లు తాగే పరిస్థితి లేదిప్పుడు.
ఒకప్పుడు పది కాంటూర్లుగా ఉన్న కొల్లేరును... ఐదింటికి కుదించారు. ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరు వరకూ ఆక్రమణలు ఉన్నాయి. సరస్సుకు దారితీసే కాలువలూ కబ్జాకు గురయ్యాయి. 450 చదరపు కిలోమీటర్ల పరిధిలోని కొల్లేరుపై ఉప్పుటేరు ప్రభావం వల్ల..... సరస్సులో ఉప్పునీటి శాతం పెరుగుతోంది. ఇందుకు తోడు కొల్లేరు పరిసరాల్లో ఉప్పునీటి బోర్లు అధికంగా వేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారని.... ఇప్పటికైనా ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని కొల్లేరు పరిరక్షణ కమిటీ సభ్యులు కోరుతున్నారు. కొల్లేరు, ఉప్పుటేరు కలిసేచోట నియంత్రికలు ఏర్పాటు చేసి... సరస్సును కాపాడాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.