రాష్ట్రానికి మరో 4.40 లక్షల కొవిడ్ టీకాలు చేరుకున్నాయి. ముంబైలోని కేంద్ర వ్యాక్సినేషన్ సెంటర్ నుంచి 2.40 లక్షలు, పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి మరో 2 లక్షల, 36 బాక్సుల కరోనా టీకాలు.. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన టీకాలను.. గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.
మరో ఆరు లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. టీకాల రాకతో రేపటి నుంచి మరో రెండు రోజుల పాటు జరగనున్న టీకా ఉత్సవ్ ద్వారా 45 ఏళ్ల పైబడిన వారికి ప్రభుత్వం కరోనా టీకా అందించనుంది. వైద్యారోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్‌ను అధికారులు తరలించనున్నారు.