Tenant Farmers Problems in YSRCP Government :రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో రుణ అర్హత కార్డులతో పాటు, మండల వ్యవసాయ అధికారులు కూడా భూ యజమాని అంగీకారంతో పని లేకుండా సీఓసీ కార్డులు (COC Cards) ఇచ్చేవారు. వాటి ఆధారంగానే రైతులకు లక్ష వరకు హామీ లేని పంట రుణాలు ఇచ్చారు. భూ యజమానుల పట్టాదారు పాసు పుస్తకంతో కౌలు రైతుల వేలిముద్రపై విత్తనాలు ఇచ్చేవారు. రాయితీ పథకాలు (Subsidy Schemes to Farmers) కూడా అందేవి. కౌలు రైతులకు పంటరుణాల విషయంలో బహుళ ప్రయోజన విస్తరణాధికారులు చొరవ తీసుకునేవారు. అందుకే అప్పట్లో కౌలు రైతులకు పంట రుణాలు ఏడాదికి 3 వేల కోట్ల నుంచి 4 వేల కోట్లకు పైగా దక్కాయి. మండల వ్యవసాయ అధికారి ఇచ్చే కార్డు ఉంటే రాయితీ విత్తనాలు కూడా ఇచ్చేవారు.
కౌలు రైతు గోడు ప్రభుత్వానికి పట్టదా? సాగునీరు లేక బ్యాంకు రుణాలు రాక అవస్థలు
CM Jagan Cheating Tenant Farmers :వైఎస్సార్సీపీ పాలనలో కౌలు రైతులకు కార్డుల (Cards for Tenant Farmers) జారీలోనూ అలవిమాలిన జాప్యం జరుగుతోంది. ఖరీఫ్ ఆరంభంలోనే కౌలుదారుల్ని గుర్తించి వెంటనే కార్డులు ఇవ్వడం ప్రారంభించాలి. కానీ అధికారులు జూన్, జులైలో కార్డుల జారీ మొదలుపెట్టి తూతూమంత్రంగా సెప్టెంబరు వరకు కొనసాగించారు. కార్డులు చేతికి వచ్చే సమయానికి పంట పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద రైతులు అప్పు తెచ్చుకుంటున్నారు. భూయజమాని అంగీకారం లేకపోవడంతో ఈ-క్రాప్‌లోనూ కౌలు రైతుల పేర్లు నమోదు కావడం లేదు. దీంతో పంటలు దెబ్బతిన్నప్పుడు పెట్టుబడి రాయితీ, పంటల బీమా కూడా అందుకోలేకపోతున్నారు. సాగుదారు హక్కు కార్డులు లేక కౌలుదార్లకు పెట్టుబడి రాయితీ దక్కడం లేదు.