ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ బస్సును ప్రత్యేకంగా అలంకరించిన గ్రామస్థులు.. ఎందుకంటే.. - వరంగల్​ జిల్లా వర్ధన్నపేట తాజా వార్తలు

special bus for Nallabelli village: ప్రభుత్వ ఆస్తులను చాలా చులకనగా చూసే ఈ రోజుల్లో ఆ గ్రామస్థులు చేసిన పనికి ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. చాలా నెలలుగా బస్సు రవాణా లేని ఆగ్రామానికి గ్రామస్తులు ఫిర్యాదులు, నాయకులు కృషి ఫలితంగా ఆర్టీసీ బస్సు వేయడంతో వారు ఆనందానికిలోనై బస్సును ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు చేసి ఇక నుంచి ఈ ఆస్తి మాది దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యతమాపై ఉందంటూ ప్రమాణం చేశారు.

ఆర్టీసీ బస్సు
ఆర్టీసీ బస్సు

By

Published : Nov 10, 2022, 8:03 PM IST

special bus for Nallabelli village: తెలంగాణలోని వరంగల్​ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామస్థులకు బస్సు సౌకర్యం లేని లోటు స్పష్టంగా తెలుసు. ఎనిమిది నెలలు రవాణా సౌకర్యం లేకుండా ఆ గ్రామవాసులు పడిన బాధలు ఆ దేవుడుకే ఎరుక.. వారు తిరగని ఆఫీసులు లేవు.. కలవని నాయకుడు లేరు.. పట్టువిడవని విక్రమార్కుడులా వారి కృషికి తెలంగాణ ఆర్టీసీ ఒక రోజు శుభవార్త చెప్పింది. అదే ఆ గ్రామానికి ఆర్టీసీ బస్సు పున:ప్రారంభిస్తామని వార్త.. ఆ వార్తతో గ్రామస్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

గ్రామంలోకి వచ్చిన ఆర్టీసీ బస్సుకు అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రయ్.. రయ్​ అంటూ చేతులు ఊపి బస్సు ప్రారంభించారు. ఇకనుంచి ఈ బస్సు మా అందరిది.. దీనిని ప్రత్యేకంగా చూసుకునే బాధ్యత మాపై ఉంది. ఆర్టీసీ ఆస్తులు మన ఆస్తులు.. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రమాణం చేసి కొబ్బరి కాయ కొట్టి బస్సును ప్రారంభించారు. నల్లబెల్లి నుంచి వరంగల్​కు బస్సు సర్వీస్​ వేసిన ఆర్టీసీ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details