తెలంగాణ నుంచి పెనుగంచిప్రోలుకు తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముందుస్తు సమాచారం మేరకు తనిఖీలు చేసి పది మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 1430 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్ఈబీ అదనపు ఎస్పీ ముకుల్ జిందాల్.... పెనుగంచిప్రోలు పోలీస్స్టేషన్ ను సందర్శించారు. వివరాలు తెలుసుకున్నారు. ఎస్సైలు మురళీకృష్ణ, రామకృష్ణ, ఇతర సిబ్బందిని అభినందించారు.