కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలోని వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లోని పలు గ్రామాల్లో మిర్చి కోతల కోసం వచ్చిన తెలంగాణ వలస కూలీలు చిక్కుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో జిల్లా సరిహద్దులు చెక్ పోస్ట్లు పూర్తిగా మూసివేసిన కారణంగా.. కూలీలు వారి స్వస్థలాలకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. రెండు మండలాల్లోని సుమారు పది గ్రామాల్లో వెయ్యి నుంచి 1500 మంది ఇంకా రాష్ట్ర పరిధిలోనే ఉన్నారు . వీరంతా తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందినవారు. తాము సొంత గ్రామాలకు వెళ్లేందుకు పోలీసులు అవసరమైన సహాయం అందించాలని వారు కోరుతున్నారు.
లాక్డౌన్ ఎఫెక్ట్: ఇరుక్కుపోయిన తెలంగాణ కూలీలు - boaredrs closed due to covid-19 latest updates
లాక్డౌన్ కారణంగా చాలా చోట్ల ప్రజలు చిక్కుకుపోయారు. సొంత రాష్ట్రాలకు వెళ్లేలేని పరిస్థితి. పొట్ట కూటి కోసం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన సుమారు 1500 కూలీలు జగ్గయ్యపేట ప్రాంతంలో ఇరుక్కుపోయారు.
ఆంధ్రాలో ఇరుక్కపోయిన తెలంగాణ కూలీలు