పురపాలక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపిస్తే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 5రూపాయలకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను తెదేపా తిరిగి ప్రారంభిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అన్న క్యాంటీన్ల ద్వారా తెదేపా ప్రభుత్వం ప్రజలకు గొప్ప సేవలందించిందని ఆయన గుర్తుచేశారు. జూలై 2019 వరకు దాదాపు 6 లక్షల మంది పేద ప్రజలు మూడు పూటలా అన్న క్యాంటీన్లలో ఆత్మగౌరవంతో భోజనం పొందారన్నారు. వైకాపా అధికారంలోకి రాగానే వాటిని మూసివేసి నిరుపేదల నోటి దగ్గరి కూడును లాగేసుకుందని ఆక్షేపించారు. క్యాంటీన్లలో అవినీతి అంటూ వైకాపా చేసిన ఒక్క ఆరోపణల్లో ఒక్కదాన్నీ నిరూపించలేకపోయిందన్నారు. అన్న క్యాంటీన్ ప్రాంగణాలను షాపింగ్ కాంప్లెక్సులగా మార్చి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
'తెదేపాను గెలిపిస్తే... అన్న క్యాంటీన్లు పునః ప్రారంభిస్తాం' - municipal elections in AP
వైకాపా అధికారంలోకి రాగానే 5 రూపాయలకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసివేసిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆక్షేపించారు. పురపాలక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపిస్తే అన్న క్యాంటీన్లను తెదేపా తిరిగి ప్రారంభిస్తుందని స్పష్టం చేశారు.
తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
ఇవీ చదవండి: సహకార వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలి: సీఎం జగన్
Last Updated : Mar 3, 2021, 10:57 PM IST