ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pattabhi on OTS: 'ఓటీఎస్​ పథకం బోగస్.. ప్రజలెవరూ నమ్మొద్దు..' - AP NEWS

Pattabhi on OTS: పేద ప్రజలను మోసం చేసేందుకే.. సీఎం జగన్ ఓటీఎస్ పథకం అమలు చేస్తున్నారని తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. బోగస్​ అయిన ఆ పథకాన్ని ప్రజలెవరూ నమ్మొద్దని తెలిపారు. ​

tdp-spokesperson-pattabhi-comments-on-ots-scheme
'ఓటీఎస్​ పథకం బోగస్.. ప్రజలెవరూ నమ్మొద్దు..'

By

Published : Dec 10, 2021, 10:23 AM IST

'ఓటీఎస్​ పథకం బోగస్.. ప్రజలెవరూ నమ్మొద్దు..'

pattabhi comments on govt: ఓటీఎస్​ పథకం బోగస్‌ అని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. పేదలను మోసం చేయడానికే.. ముఖ్యమంత్రి జగన్ ఈ వసూళ్లు చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రజలు ఎవరూ దీన్ని నమ్మొద్దన్నారు. హడ్కో, నాబార్డు, బ్యాంకుల అప్పులు ఎవరు కట్టాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేశామంటున్న రూ.10 వేల కోట్లకు ఆధారాలేంటని నిలదీశారు.

కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించినట్లు సీఏజీ చెప్పలేదా అని పట్టాభి ప్రశ్నించారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్‍కు.. నేటికీ 16 వేల కోట్ల అప్పు ఉన్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఓటీఎస్ పేరుతో మానసిక క్షోభకు గురిచేస్తున్న పేదలకు సమాధానం చెప్పాలని సూచించారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్‍ అప్పు చెల్లింపుల కోసం ప్రభుత్వం వెంటనే రూ.10 వేల కోట్లు జమ చేయాలని అన్నారు.

ఇదీ చూడండి:

bills pending: బిల్లుల పెండింగ్ కారణంగా.. ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర ఆహారం

ABOUT THE AUTHOR

...view details