వైకాపా రెండేళ్ల పాలనపై ముఖ్యమంత్రి విడుదల చేసిన పుస్తకంలో మొదటి పేజీ నుంచి చివరి వరకు అన్నీ అబద్దాలేనని... తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్(Saptagiri Prasad) దుయ్యబట్టారు.
TDP: 'వైకాపా రెండేళ్ల పాలనపై విడుదల చేసిన పుస్తకంలో అన్నీ అబద్దాలే'
వైకాపా రెండేళ్ల పాలనపై విడుదల చేసిన పుస్తకంలో అన్ని అబద్దాలేనని... తెదేపా సీనియర్ నేత సప్తగిరి ప్రసాద్(Saptagiri Prasad) మండిపడ్డారు. ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు.
సప్తగిరి ప్రసాద్
"జగన్ సీఎం అయ్యాక 18లక్షల చొప్పున రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు తొలగించారు. చంద్రన్న బీమా, పెళ్లికానుక, నిరుద్యోగభృతి, అన్న క్యాంటీన్లు రద్దు చేశారు. ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదు. ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకుని పాలిస్తే మంచిది." సప్తగిరి, తెదేపా అధికార ప్రతినిధి
ఇదీ చదవండి