ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అచ్చెన్న డిశ్చార్జి తీరు అనుమానాలకు తావిస్తోంది : చినరాజప్ప - చినరాజప్ప వార్తలు

అచ్చెన్నాయుడి వ్యవహారంలో ప్రభుత్వ తీరు అనుమానాలకు తావిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్ప మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా... అచ్చెన్నను డిశ్చార్జి చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

tdp polit bureau members fires on government about achenaidu discharge
అచ్చెన్నాయుడి డిశ్చార్జిపై మండిపడ్డ చినరాజప్ప

By

Published : Jun 25, 2020, 11:40 AM IST

న్యాయస్థానాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నా జగన్ ధిక్కరించి వ్యవహరిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్ప మండిపడ్డారు. జగన్ పిచ్చి పరాకాష్టకు చేరటంతో ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

అచ్చెన్నాయుడిని కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా డిశ్చార్జ్ చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కుట్రలో భాగంగానే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా పోస్టు పెడితే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, రాష్ట్రంలో భావప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details