కృష్ణా నది వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. గుంటూరు జిల్లా వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లో వరద బాధితులను పరామర్శించారు. వర్షంలోనూ చంద్రబాబు పర్యటన కొనసాగింది. ''ఒక్క వరదకే చేతులెత్తేసిన వైకాపా ప్రభుత్వం... ఐదేళ్లు రాష్టాన్ని ఎలా పరిపాలిస్తుంది'' అని చంద్రబాబు ప్రశ్నించారు. వరద నిర్వహణలో విఫలమయ్యారా, కావాలనే వరద నీటిని వదిలారా మంత్రులు చెప్పాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలన్నారు. విపత్తుల్లో పార్టీలు చూడకుండా సాయం అందించాలని కోరారు.
ఒక్క వరదకే చేతులెత్తేస్తే... ఐదేళ్లు ఎలా పాలిస్తారు: చంద్రబాబు - వరద బాధితులు
కృష్ణా వరద ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటించారు. గుంటూరు జిల్లా వేమూరు, తెనాలి ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం వరద నిర్వహణలో విఫలమయ్యిందన్నారు. పంట నష్టపోయిన ప్రతీరైతుకు 25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఒక్క వరదకే చేతులెత్తేస్తే...ఐదేళ్లు ఎలా పరిపాలిస్తారు : చంద్రబాబు