'ఆయనలా.. సీఎం జగన్ మారకూడదని దేవుణ్ని ప్రార్థిస్తున్నా' - కేశినేని నాని
రాజధాని అమరావతి మారుస్తారని వస్తున్న వార్తలపై తెదేపా ఎంపీ కేశినేని నాని స్పందించారు. చిన్నప్పుడు తుగ్లక్ గురించి చరిత్ర పుస్తకాల్లో చదివామని గుర్తుచేసుకున్న నాని...ఆయన మాదిరిగా సీఎం జగన్ చరిత్రలో ఎక్కకూడదని భగవంతుని కోరుకుంటున్నానని ట్విట్ చేశారు.
tdp nani
రాజధాని మార్పు వార్తలపై ట్విట్టర్‌లో స్పందించారు తెదేపా ఎంపీ కేశినేని నాని.చిన్నప్పుడు తుగ్లక్ గురించి చరిత్ర పుస్తకాల్లో చదివామని...1328లో దిల్లీ నుంచి రాజధానిని మహారాష్ట్రలోని దౌలతాబాద్‌కు మార్చారని ఆయన గుర్తుచేశారు.అనంతరం దౌలతాబాద్ నుంచి తిరిగి దిల్లీకి మార్చిన వైనం చూశామన్నారు.తుగ్లక్ మాదిరిగా జగన్ చరిత్రలో ఎక్కకూడదని భగవంతుని కోరుకుంటున్నానని ట్విట్ చేశారు కేశినేని నాని.