నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల అక్రమాల్లో వైకాపా నేతల పాత్ర ఉందని ఆరోపిస్తూ తెలుగుదేశం నేతలు ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేశారు. అక్రమాలపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు కాకుండా దళారులు కేంద్రాల్లో చేరి కొనుగోళ్లు చేస్తున్నందున రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వైకాపా నేతల అండతో 700 కోట్ల రూపాయలకు పైగా దళారులు దండుకున్నారని ఆరోపించారు. దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకుని రైతుల్ని ఆదుకోవాలని ఎమ్మెల్సీలు అశోక్ బాబు, బుద్ధా వెంకన్న గొట్టిపాటి రామకృష్ణ తదితర నేతలు ఏసీబీ డీజీని కలిసి వినతిపత్రం అందజేశారు.
ధాన్యం కొనుగోళ్ల అక్రమాల్లో వైకాపా నేతల పాత్ర: తెదేపా
వైకాపా నేతల అక్రమాలపై విచారణ జరిపించాలని తెదేపా ఎమ్మెల్సీలు ఏసీబీ డీజీని కలిసి వినతిపత్రం అందించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు కాకుండా.. దళారులు కేంద్రాల్లో చేరి కొనుగోళ్లు చేస్తున్నందున రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
tdp mlcs