తెదేపా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ రావు దంపతులపై వైకాపా తూర్పు నియోజక ఇంచార్జీ దేవినేని అవినాష్ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని... తెదేపా నేతలు రత్నం రమేష్ తదితరులు డిమాండ్ చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌ను చూసి.. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేర్చుకోవాలని అన్నారు. ప్రతీ పేద కుటుంబానికి 5 వేలు ఇవ్వమని కోరడంలో తప్పు లేదని.. అది ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. హూద్‌హూద్ తుఫాన్ సమయంలో పేదలకు 5 వేల రూపాయలు ఇవ్వాలని ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఈ ఆపద సమయంలో ప్రజలకు 5వేలు ఇవ్వాలనే డిమాండ్‌లో న్యాయం ఉందన్న విషయం అవినాష్ గ్రహించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే డిమాండ్ మేరకు నియోజక వర్గంలోని పేదలకు.. 5వేల రూపాయలు ఇచ్చే విధంగా అవినాష్ కృషి చేయాలని సవాల్ చేశారు.
'ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి' - తెదేపా నేత రత్నం రమేష్ న్యూస్
కరోనాలాంటి కష్ట సమయంలో పేదలకు 5వేల రూపాయల సహాయం చేయమని ఎమ్మెల్యే అడగటంలో తప్పేముంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ ఇదే అడిగారు. ఇప్పటికైనా ఆయనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి.
tdp members ratnam ramesh and othrs fire on ycp mla devineni avinash