వచ్చే ఎన్నికల్లో తెదేపా ప్రత్యర్థులను చిత్తుగా ఓడించాలని ఆ పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని నాని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా లక్ష్మీపురంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు.
తెదేపా సమావేశం
By
Published : Mar 20, 2019, 12:09 AM IST
తెదేపా సమావేశం
కృష్ణా జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురంలో నియోజకవర్గ తెదేపా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి తెదేపా తిరువూరు అభ్యర్థి కేఎస్ జవహర్, ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను చిత్తుగా ఓడించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అనేక అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్... చంద్రబాబుతో పోటీపడుతున్నారని విమర్శించారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే చంద్రబాబుకే మళ్లీ పట్టం కట్టాలని కోరారు.