ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కక్షపూరిత రాజకీయాలతో ప్రతిపక్షాలను భయపెట్టలేరు' - కక్షపూరిత రాజకీయాలతో ప్రతిపక్షాలను భయపెట్టలేరు

హత్య కేసులో అరెస్టైన మాజీమంత్రి కొల్లు రవీంద్ర కుటుంబాన్ని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ పరామర్శించారు. కొల్లుపై కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టారని వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

'కక్షపూరిత రాజకీయాలతో ప్రతిపక్షాలను భయపెట్టలేరు'
'కక్షపూరిత రాజకీయాలతో ప్రతిపక్షాలను భయపెట్టలేరు'

By

Published : Jul 9, 2020, 3:35 PM IST

మాజీమంత్రి కొల్లు రవీంద్రపై అక్రమంగా హత్యకేసు బనాయించటం దారుణమని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు. మచిలీపట్నంలోని కొల్లు నివాసంలో ఆయన కుటుంబసభ్యులను వారు పరామర్శించారు. కొల్లుపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ఆయనకు తగు భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉందన్నారు. కక్షపూరిత రాజకీయాలతో ప్రతిపక్షాలను భయపెట్టలేరన్న విషయాన్ని సీఎం జగన్ తెలుసుకోవాలన్నారు.

న్యాయస్థానాలపరంగా ఆక్షేపణీయమైన వ్యాఖ్యలు వస్తే గతంలో పలువురు మంత్రులు రాజీనామా చేసిన చరిత్ర ఉందని గద్దెరామ్మోహన్‌ గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఎన్నిసార్లు అక్షింతలు వేసినా... ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కొల్లు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details