ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖ వాసులను వైకాపా క్రూరులుగా చిత్రీకరిస్తోంది' - తెదేపా నేత గోరంట్ల బచ్చయ్య చౌదరి వార్తలు

వైకాపా నేతలు విశాఖ వాసులను క్రూరులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తెదేపా నేతలు మండిపడ్డారు. విశాఖ అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధినీ వైకాపా అడ్డుకుంటోందని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయమే చట్టమైనప్పుడు ఎదిరించటమే ప్రతి ఒక్కరి బాధ్యత అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్‌ చేశారు.

tdp
tdp

By

Published : Feb 29, 2020, 5:49 PM IST

గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్‌

చంద్రబాబు విశాఖ పర్యటనలో జరిగిన పరిణామాలతో.... ముఖ్యమంత్రి జగన్‌ క్రూరత్వం బయటపడిందని తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రజలే చంద్రబాబుపై కోడిగుడ్లు విసిరారని అసత్యాలు ప్రచారం చేస్తూ.... వైకాపా నేతలు విశాఖ వాసులను అవమానిస్తున్నారని విమర్శించారు. శాంతికి నిదర్శనంగా నిలిచే విశాఖ వాసులను వైకాపా నేతలు.... రౌడీలు, సంఘవిద్రోహులతో పోలుస్తున్నారని మండిపడ్డారు. రౌడీయిజాన్ని ప్రేరేపిస్తూ.... విశాఖ అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధిని కూడా వైకాపా అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లర్లను ప్రోత్సహించడం ద్వారా పెట్టుబడులు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు.

సీమాంధ్రులు జగన్​ను నమ్మి మోసపోయారని తెదేపా సీనియర్​ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో విమర్శించారు. అన్యాయమే చట్టమైనప్పుడు ఎదిరించటమే ప్రతి ఒక్కరి బాధ్యతని గోరంట్ల ట్వీట్‌ చేశారు. ప్రతి ఒక్కరూ పోరాటమనే అస్త్రాన్ని ఉపయోగించాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా ఓ పిట్టకథను తన ట్విటర్‌లో పోస్ట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details