లాక్డౌన్ నేపథ్యంలో కృష్ణా జిల్లా కంచికచర్లలో పేదలకు మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం పేదలకు అండగా ఉండాలని.. వారికి తగిన సహాయం చేసి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెదేపా ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కంచికచర్లలో పేదలకు నిత్యావవసరాల పంపిణీ - corona
లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు, పేదలకు సహాయం అందించేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో తెదేపా నేతలు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన తెదేపా నేతలు