ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

8 మంది తెదేపా నాయకులపై కేసు నమోదు

రెడ్​జోన్​ పరిధిలో ఉన్న గొల్లపూడి గ్రామంలో పేదలకు కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని తెదేపా నాయకులు చేపట్టారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి బ్రహ్మం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 8 మంది తెదేపా నాయకులను శనివారం అరెస్ట్​ చేశారు.

tdp leaders arrested for distribution of vegetables in red zone
రెడ్​జోన్​ పరిధిలో కూరగాయల పంపిణీ చేపట్టినందుకు తెదేపా నాయకులపై కేసులు నమోదు

By

Published : Apr 27, 2020, 7:57 AM IST

విజయవాడ శివారు గొల్లపూడి గ్రామంలో కూరగాయల పంపిణీ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. కొత్తూరు తాడేపల్లి గ్రామంలో పేదలకు కూరగాయలను పంపిణీ చేసేందుకు తెదేపా నాయకులు గొల్లపూడిలో శనివారం రాత్రి ఏర్పాట్లు చేస్తుండగా ఎస్‌ఐ ఇజ్రాయెల్‌ తన సిబ్బందితో వచ్చి అడ్డుకున్నారు. గొల్లపూడి రెడ్‌జోన్‌ పరిధిలో ఉండగా ఈ విధమైన కార్యక్రమాలు చేయడం నిషేధమని చెప్పారు. రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్న గ్రామంలో గుంపులుగా కార్యక్రమాలు చేపడుతున్నారంటూ పంచాయతీ కార్యదర్శి బ్రహ్మం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామ తెదేపా అధ్యక్షుడు నర్రా వాసు, మండలం ఉపాధ్యక్షుడు నారదా, నీరుకొండ శ్రీనివాసరావు, రేవంత్‌, క్రాంతి స్వరూప్‌, వి.సురేష్‌, కె.వెంకటేష్‌, అన్వర్‌లపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం స్టేషన్‌ బెయిల్‌పై వారిని పంపించారు. కూరగాయలను మాత్రం పంచాయతీ కార్యాలయం వద్దకు పంపించారు.

రెడ్​జోన్​ పరిధిలో కూరగాయల పంపిణీ చేపట్టినందుకు తెదేపా నాయకులపై కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details