మంత్రి కొడాలి నాని, అతని అనుచరులతో నాకు ప్రాణభయం ఉందని కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా మాజీ పట్టణ అధ్యక్షుడు రాంబాబు ఆరోపించారు. ఈ మధ్యకాలంలో రాజధాని వ్యవహారంలో మంత్రి కొడాలి నాని మాట్లాడిన మాటలు ఖండించిన తెదేపా నేత రాంబాబు ఇంటిపై గత రాత్రి కొడాలి నాని అనుచరులు 20 మంది దాడి చేశారని ఆరోపిస్తూ గుడివాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుతో కలిసి ఫిర్యాదు చేశారు.
తెదేపా నేత ఇంటిపై దుండగులదాడి - కృష్ణా జిల్లా వార్తలు
గుడివాడలో తెదేపా నేత రాంబాబు ఇంటిపై గురువారం దుండుగులు దాడి చేశారు. కొడాలి నాని అనుచరులు 20 మంది దాడి చేశారని ఆరోపిస్తూ... గుడివాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుతో కలిసి రాంబాబు ఫిర్యాదు చేశారు.
తెదేపా నేత రాంబాబు
మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతోనే తమ ఇంటి పై దాడికి తెగబడ్డారని... నిందితులను పట్టుకుని శిక్షించాలని రాంబాబు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఇలాంటి చర్యలను సహించబోమని ఐదు రోజులలో నిందితులను శిక్షించాలని లేకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని ఎమ్మెల్సీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు హెచ్చరించారు.
ఇదీ చదవండి:గన్నవరం: ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, రైతులకు మధ్య వాగ్వాదం