జగన్ నాయకత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ యువకులు.... శ్రామికులతో పాటు రైతులను నిలువునా మోసగించారని తెదేపా సీనియర్ నేత కూన రవికుమార్ విమర్శించారు. రైతులు పంటలు వేసుకునే సమయానికి వారికి అవసరమైన విత్తనాలు, రుణాలు అందించడంలో విఫలమైందన్నారు. నాణ్యమైన విత్తనాలు దొరక్క, అప్పులు పుట్టక సాగు చేసేమార్గం లేక రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు.
జగన్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది: కూన
వైకాపా ప్రభుత్వం రైతులను మోసం చేసిందని తెదేపా నేత కూన రవికుమార్ ఆరోపించారు. సకాలంలో రైతులకు విత్తనాలు, రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఖరీఫ్‌కు సంబంధించి ప్రభుత్వం ఏవిధమైన రుణ ప్రణాళికలు విడుదల చేయలేదని... బ్యాంకర్లతో చర్చలు జరపలేదని కూన రవికుమార్ అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వం రైతురుణమాఫీ పేరుతో విడుదల చేసిన నిధులను వారికి అందకుండా చేశారని దుయ్యబట్టారు. రైతు భరోసా పేరుతో ఏటా ప్రతి రైతుకు 12,500 రూపాయలు మే నెలలో ఇస్తానని చెప్పి వారిని మోసం చేశారని ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం ఏడాదిలో 87వేల కోట్ల అప్పులు చేసి దుబారా చేసిందని ఆరోపించారు. రైతులకు రూపాయి ఇవ్వలేదని విమర్శించారు.
ఇదీ చదవండి:ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్టు