కృష్ణాజిల్లా మచిలీపట్నం పోలీసులపై మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం 25వ డివిజన్ సరస్వతి ఎయిడెడ్ పాఠశాలలో తన ఓటు హక్కు వినియోగించుకుంటున్న సమయంలో వైకాపా-తెదేపా కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కొల్లు రవీంద్రను మీడియాతో మాట్లాడనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కొల్లు రవీంద్రను తోసుకుంటూ పక్కకు తీసుకువెళ్లారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులపై మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం - ap municipal elections latest news
కృష్ణాజిల్లా మచిలీపట్నం పోలీసుల తీరుపై మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం 25వ డివిజన్ సరస్వతి ఎయిడెడ్ పాఠశాలలో ఓటు వేసిన అనంతరం.. కొల్లు రవీంద్రను మీడియాతో మాట్లాడనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
tdp leader kollu ravindra fires on Machilipatnam police
పోలీసులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు. ఎన్నికల పరిశీలనకు వెళ్తున్న కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. నేల మీద కూర్చొని పోలీసుల తీరుపై నిరసన తెలిపారు.
ఇదీ చదవండి: 'నా ఓటెక్కడ..?' డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు మిస్సింగ్