వ్యక్తిగత ప్రయోజనాల కోసం, కేసులు మాఫీ చేసుకునేందుకు ఎవరు ఎవరి కాళ్లపై పడుతున్నారో మంత్రి కొడాలి నానికి తెలియదా అని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు. కేంద్రం మెడలు వంచి, ప్రత్యేక హోదా తెస్తామన్న వాళ్లు, రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి పార్లమెంటులో అసందర్భంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రి పదవి పోతుందన్న భయంతోనే నాని మతాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చురేపడానికే వైకాపా ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఆ భయంతోనే మతాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు' - కొడాలి నానీపై దివ్యవాణి విమర్శలు
మంత్రి పదవి పోతుందన్న భయంతోనే కొడాలి నాని మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు. వైకాపా ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు.
దివ్యవాణి, తెదేపా అధికార ప్రతినిథి