వైకాపా ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఉపాధి కోల్పోయారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఖాళీ సిలిండర్లతో వినూత్న నిరసన తెలిపారు. ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నుల పెంపు నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
పెరిగిన ధరలను తగ్గించాలి: బోండా ఉమ - news updates in vijayawada
విజయవాడ ధర్నా చౌక్‌లో తెదేపా నేత బోండా ఉమ నిరసన చేపట్టారు. పెరిగిన నిత్యావసరాలు, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన