'తెదేపా నిర్మించిన వాటికి వైకాపా రంగులద్దటమే పాలనా?'
వైకాపా పాలనపై తెదేపా నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రతిపక్షనేతగా ముద్దులు కురిపించిన జగన్.. పీఠమెక్కిన తర్వాత తెదేపా ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను రద్దు చేశారని దుయ్యబట్టారు.
tdp-leader-acchem-naidu-fire-on-ysrcp-governament-in-twitter
మెడ్‌టెక్ జోన్‌లో తయారైన కరోనా టెస్టింగ్ కిట్లు తామే తెచ్చామని చేప్పుకోవడం వైకాపాకు తగదని అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖలో మెడ్‌టెక్ జోన్‌ని 2018లో చంద్రబాబు ప్రారంభించారని గుర్తు చేశారు. జగన్ సీఎం అయ్యాక దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ వేసి ఎండీని తొలగించారని మండిపడ్డారు. తెదేపా కట్టినవాటికి వైకాపా రంగులు అద్దటమే పాలనా? అని ప్రశ్నించారు.