విజయవాడలోని వాంబేకాలనీ 60వ డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని తెదేపా ప్రారంభించింది. ఎన్నికల ప్రచారంలో మాజీఎమ్మెల్యే, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు. కాలనీలోని వీధులన్నీ కలియతిరిగి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. పెరిగిన నిత్యావసర ధరలకు కళ్లెం వేయడం తెదేపాతోనే సాధ్యమని ఆయన అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తెదేపాను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నగర అభివృద్ధితో పాటు.. సామాన్య ప్రజలకు పెనుభారంగా మారుతున్న అంశాలను పరిగణలోకి తీసుకుని వాటిని రూపుమాపేందుకు కృషి చేస్తామని బొండా ఉమ హామీ ఇచ్చారు.
'నిత్యావసర ధరలకు కళ్లెం.. తెదేపాతోనే సాధ్యం' - bonda uma latest news
పురపోరులో భాగంగా విజయవాడలో తెదేపా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. వాంబేకాలనీ 60వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో మాజీఎమ్మెల్యే, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమ పాల్గొని.. కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు కళ్లెం వేయడం తెదేపాతోనే సాధ్యమన్నారు.
తెదేపా ఎన్నికల ప్రచారం