ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తల్లితో సహజీవనం.. ఆమె కుమార్తెపై అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చిన బాలిక! - కృష్ణా జిల్లా తాజా వార్తలు

Girl raped in Machilipatnam
మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం

By

Published : Apr 30, 2022, 9:06 AM IST

Updated : Apr 30, 2022, 10:00 AM IST

09:02 April 30

మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం

రోజురోజుకూ మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. తామూ ఓ తల్లికే పుట్టామని, తమకూ అక్కాచెల్లెల్లు ఉంటారని మరిచి అకృత్యాలకు పాల్పడుతున్నారు కొందరు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆడపిల్ల కనిపిస్తే చాలు.. దారుణాలకు ఒడిగడుతున్నారు! వావివరుసలు మరిచి కుటుంబం, బంధువుల్లోని అబలలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు ఇంకొందరు. ఇలా వరుస ఘటనలతో రాష్ట్రం వణికిపోతోంది. తాజాగా ఓ కీచకుడు మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఆ కామాంధుడి ఆఘాయిత్యానికి బలైన ఆ బాలిక.. ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మహిళతో సహజీవనం‌ చేస్తున్న నిందితుడు.. ఆమె కుమార్తెపై ఘాతుకానికి ఒడిగట్టాడు. తండ్రి స్థానంలో ఉన్న సదరు వ్యక్తి.. పది నెలలుగా బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీంతో.. బాలిక గర్భం దాల్చింది. ఆలస్యంగా గుర్తించిన బంధువులు.. ఆస్పత్రిలో చేర్పించగా ప్రభుత్వాస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ అ మానవీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్న నిందితుడు సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిలకలపూడి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: నా వేధింపుల గురించి చెబితే.. మెడలో ఆ తాళి కట్టేస్తా: కీచక టీచర్

Last Updated : Apr 30, 2022, 10:00 AM IST

ABOUT THE AUTHOR

...view details