తరిగొప్పుల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సస్పెన్షన్ - తరిగొప్పుల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సస్పెండ్
క్రమశిక్షణ చర్యల కింద కృష్ణ జిల్లా ఉంగుటూరు మండలం తరిగొప్పుల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంను సస్పెండ్ చేస్తున్నట్లు.. డీఈవో రాజ్యలక్ష్మీ ఆదేశాలు జారీ చేశారు.
సస్పెండ్‌కు గురైన తరిగొప్పుల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం
కృష్ణ జిల్లా ఉంగుటూరు మండలం తరిగొప్పుల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పీవీవీ.ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో రాజ్యలక్ష్మీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 13న జరిగిన నాడు-నేడు దృశ్య మధ్యమ సమీక్షలో చరవాణి వినియోగిస్తూ.. అశ్రద్ధ కనబరచారని ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్లు రాజ్యలక్ష్మి తెలిపారు. జేసీ ఆదేశాలతో సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు ఇచ్చారు. క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో రాజ్యలక్ష్మి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.