రంజాన్ పండుగ సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముస్లిం సోదరులకు కానుక అందజేశారు. తెదేపా హయాంలో రంజాన్ తోఫా పేరిట ముస్లింలకు సరకులు అందజేశామని గుర్తుచేశారు. ఇప్పటి వైకాపా ప్రభుత్వం రద్దులు చేయడం తప్ప ఇచ్చేదేమీ లేదని ఎద్దేవా చేశారు. లాక్ డౌన్ కారణంగా బడుగు బలహీన, పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
'ఇప్పటి ప్రభుత్వానికి రద్దు చేయడమే తెలుసు' - నందిగామలో ముస్లింలకు తోఫా పంపిణీ
తమ ప్రభుత్వ హయాంలో ముస్లిం సోదరులు పండుగ సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రంజాన్ తోఫా ఇచ్చామని.. ఇప్పటి ప్రభుత్వం పథకాలను రద్దు చేయడం తప్ప ఇస్తున్నదేమీ లేదని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. కృష్ణా జిల్లా నందిగామలో ముస్లింలకు సరకులు అందజేశారు.

ముస్లింలకు సరకులు పంచుతున్న తంగిరాల సౌమ్య