జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పిలుపు మేరకు... నేను సైతం కృష్ణమ్మ శుద్ధిలో కార్యక్రమం జూన్ 1న గుడివాడలో నిర్వహిస్తామని ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి కృష్ణమ్మ శుద్ధి కార్యక్రమం చేస్తామని చెప్పారు. ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలోని 36వ వార్డులో పేరుకుపోయిన చెత్తను తొలగించి... స్వచ్చతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని కోరారు.
కృష్ణమ్మ శుద్ధికి సిద్ధమైన గుడివాడ
జూన్ 1న ఉదయం 6గంటల నుంచి నేను సైతం కృష్ణమ్మ శుద్ధిలో కార్యక్రమం నిర్వహిస్తామని... గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. ఈ మేరకు పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్యే కొడాలి నాని