ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Vijayawada - Gudivada road : ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే.. ప్రాణాలు అరచేత పట్టుకోవాల్సిందే !

ఓ ప్రధాన నగరం నుంచి నియోజకవర్గ కేంద్రానికి వెళ్లే ఆ రహదారిపై ప్రయాణం.. వాహనదారులకు నరకప్రాయంగా మారింది. ఎటు నుంచి ఏ ముప్పు ముంచుకొస్తుందోనని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. విజయవాడ-గుడివాడ రహదారి దుస్థితిపై స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

By

Published : Jan 5, 2022, 12:11 PM IST

Vijayawada - Gudivada road damage
Vijayawada - Gudivada road damage

విజయవాడ నుంచి గుడివాడ వెళ్లే రహదారి పరిస్థితి దారుణంగా తయారైంది. కోమటిగుంట లాక్‌ దగ్గర నుంచి.. ఈ రోడ్డు మొత్తం ప్రమాదాలకు నెలవుగా మారింది. రెండు వైపులా కాలువలు ఉండటం.. నాణ్యతా లోపం వంటి కారణాలు వాహనదారులకు శాపంగా మారాయి. రోడ్డుపై ఎక్కడ చూసినా గుంతలు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. నిత్యం పనుల కోసం వెళ్లేవారు, సాధారణ ప్రయాణికులు.. రోడ్డుగుండా వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. ప్రజాప్రతినిధులు నిత్యం ఈ రహదారి మీదుగానే ప్రయాణిస్తున్నా.. రోడ్డు కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదాలకు నెలవుగా విజయవాడ-గుడివాడ రహదారి

ఇక, రాత్రి వేళల్లో అయితే.. ప్రయాణాలు పెను గండాలుగా పరిణమిస్తున్నాయని, అతి వేగంతో వెళ్లే వాహనాలు ఏవైపు నుంచి వచ్చి ఢీకొడతాయోనన్న భయం వాహనదారులను వెంటాడుతోంది. వారానికి రెండు మూడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. గుడివాడ సహా చుట్టుపక్కల గ్రామాల నుంచి విజయవాడ వెళ్లాలంటే ఇదొక్కటే మార్గం. ఇలాంటి మార్గంలో ప్రయాణించాలంటే.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి వస్తోందని వాహనదారులు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఇదీ చదవండి:

TTD: తితిదే బోర్డులో నేరచరిత్ర ఉన్న వారి పేర్లను పేపర్లలో ప్రకటన ఇవ్వండి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details