ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ నలుగురినీ వదలొద్దు.. కఠినంగా శిక్షించండి'

తెలంగాణలో దిశ హత్యోదంతంపై రాష్ట్రంలో నిరసన జ్వాల చల్లారడంలేదు. తక్షణమే నిందితులకు కఠిన శిక్ష అమలు చేయాలంటూ.. ర్యాలీలు, ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా దిశా హత్యోదంతంపై నిరసన జ్వాలలు
రాష్ట్రవ్యాప్తంగా దిశా హత్యోదంతంపై నిరసన జ్వాలలు

By

Published : Dec 4, 2019, 3:59 AM IST

Updated : Dec 4, 2019, 7:49 AM IST

రాష్ట్రవ్యాప్తంగా దిశా హత్యోదంతంపై నిరసన జ్వాలలు

హైదరాబాద్‌ శివార్లలో దిశను అత్యాచారంచేసి హతమార్చిన నలుగురిని తక్షణమే శిక్షించాలంటూ కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఎంఐఎం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. పెట్రోల్‌ బంక్‌ కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో మదీనా మసీదు నుంచి...... గాంధీ విగ్రహం వరకూ ర్యాలీ చేసి.. కొవ్వొత్తులు వెలిగించారు. అనంతపురంలో విద్యార్థులు కొవ్వత్తుల ర్యాలీ చేపట్టి మానవహారంగా నిరసన తెలిపారు.

యర్రగొండపాలెంలో ప్లకార్డులతో ప్రదర్శనలు

దిశ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో... కళాశాలల విద్యార్థినులు ప్లకార్డులు ప్రదర్శించారు. కృష్ణా జిల్లా మైలవరంలో ఓ ప్రైవేట్‌ కళాశాల విద్యార్థినులు ర్యాలీచేయగా విజయవాడ ప్రధాన కూడళ్లల్లో హిజ్రాలు ప్రదర్శన చేశారు.

అక్షరాల ఆకృతిలో "దిశ"కు అంజలి

దిశపై జరిగిన పాశవిక ఘటనకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జనసేన.. ర్యాలీ నిర్వహించింది. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో దిశ అక్షరాల ఆకృతిలో విద్యార్థినులు అంజలి ఘటించారు. మహిళా ఉపాధ్యాయులు,..... అంగన్‌వాడీ కార్యకర్తలు కొవ్వత్తుల ర్యాలీ చేపట్టారు.

ర్యాలీలు.. నిరసనలు

విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎదుట కొందరు విద్యార్థులు నిరసన తెలపగా... కూర్మన్నపాలెం నుంచి వడ్లపూడి వరకూ మరికొందరు ర్యాలీ చేపట్టారు. అనకాపల్లిలో ఎన్టీఆర్ క్రీడా మైదానం నుంచి ప్రధాన రహదారుల మీదుగా విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని సుందరయ్య భవనం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలి వరకూ విద్యార్థి సంఘాలు ర్యాలీ చేశాయి.కడప జిల్లా రాయచోటిలో యువత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. కొత్తపేట జగదాంబ సెంటర్ నుంచి ఎంపీడీవో రెవిన్యూ కార్యాలయాలు బస్టాండ్ రోడ్డు మీదుగా నేతాజీ కూడలి వరకు యువత ర్యాలీ నిర్వహించింది

ఇవీ చదవండి

హోరెత్తిన ప్రజా,విద్యార్థి సంఘాలు.... దిశాకు న్యాయం చేయాలి

Last Updated : Dec 4, 2019, 7:49 AM IST

ABOUT THE AUTHOR

...view details