ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బాలుకు అక్కడే గానగంధర్వ బిరుదును ఇచ్చారు' - బాలు తాజా వార్తలు

తెలుగుజాతి తియ్యని గొంతుక ఎస్పీబీ మరణం అందరిని కలిచివేసింది. తన గానంతో సంగీత ప్రియులను తన్మయత్వంలో ముంచిన బాలసుబ్రహ్మణ్యం లేడంటే...నమ్మకం కలగడం లేదని సంగీతాభిమానులు శోకసంద్రం అవుతున్నారు. ఆయన మృతిపట్ల రాష్ట్రవ్యాప్తంగా నివాళులు అర్పించి...బాలుతో ఉన్న స్మృతులను గుర్తుచేసుకున్నారు.

state people condolence to sp balasubrhamanyam
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

By

Published : Sep 26, 2020, 8:21 AM IST

కృష్ణా జిల్లా..

నూజివీడులో బాలుకు నివాళులు

గాన గంధర్వుడు పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కృష్ణా జిల్లా నూజివీడులో స్థానికులు అశ్రునయనాలతో నివాళి అర్పించారు. నూజివీడు పట్టణం చిన్న గాంధీబొమ్మ సెంటర్లో స్వర్గీయ ఎస్పీబాలసుబ్రహ్మణ్యం చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

చిత్తూరు జిల్లా..

తంబళ్లపల్లి

తంబళ్లపల్లిలో బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి కళాకారులు నివాళులు

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి కళాకారులు నివాళులర్పించారు. ఎస్పీబీ కళాకారులలోనే ఎల్లకాలం జీవించి ఉంటాడనీ ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ కళాకారుడు నరసింహులు పేర్కొన్నారు. బాలసుబ్రహ్మణ్యం మృతి కళాకారులకు తీరని లోటని .. ఆయన మళ్లీ ఈ లోకంలో జన్మించాలి కోరకున్నారు. తెలుగు కళాకారులకు బాలసుబ్రమణ్యం నేర్పిన గానమాధుర్యం మరువలేనిదని.. వెంకటరమణ దాసు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర భజన మండలి కళాకారులు, స్థానికులు పాల్గొన్నారు.


శ్రీకాళహస్తి

ఎస్పీ బాలసుబ్రమణ్యంకి శ్రీకాళహస్తితో ఎనలేని అనుబంధం

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి శ్రీకాళహస్తితో ఎనలేని అనుబంధం ఉంది. స్థానిక ఆర్పీ బాలుర జడ్పీ ఉన్నతపాఠశాలలో 9, 10 తరగతులను విద్యనభ్యసించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఆస్థాన గాయకునిగా పనిచేసిన బాలు... ఆలయానికి అనుబంధంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యునిగా పనిచేశారు .బాలసుబ్రమణ్యం మృతితో శ్రీకాళహస్తికి తీరని లోటు ఏర్పడింది. స్థానిక ప్రజలు శోకసంద్రంలో మునిగారు.

బాలు చదివిన పాఠశాల

గుంటూరు జిల్లా ..

ఎస్పీ బాలసుబ్రమణ్యం

బాలసుబ్రహ్మణ్యం మరణం ఆయన అభిమానుల్లో తీరని ఆవేదన మిగిల్చింది. ఆయనకు తమదైన రీతిలో అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఉపాధ్యాయుడు ఫణిదెపు వెంకటకృష్ణ.... అక్షరాలతో బాలు రూపాన్ని చిత్రించి శ్రద్ధాంజలి ఘటించారు. గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అనే పదాలతో ఈ చిత్రాన్ని పూర్తి చేయటం విశేషం. తన గానమాధుర్యంతో కోట్లాది మందిని అలరించిన బాలసుబ్రహ్మణ్యానికి నివాళి అర్పించారు.

కర్నూలు జిల్లా..

మహనందీశ్వర స్వామి ఆలయంతో బాలు స్మృతులు

గాన గంధర్వుడు ఎస్పీ బాలుకు కర్నూలు జిల్లా మహానంది క్షేత్రానికి సంబంధం ఉంది. 1994లో బాలు కుటుంబ సభ్యులతో మహనందీశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. అపుడు అర్చకులు పరిచయం చేసుకున్నారు. ఆ పరిచయంతో అర్చకులు అర్జునశర్మ ఎస్పీ బాలుకు ఫోన్ చేసి క్షేత్ర ప్రాముఖ్యత, స్వామి వారి పై పాటలు పాడాలని కోరారు. స్పందించిన ఆయన సుప్రభాతంతో పాటు తొమ్మిది పాటలు పాడారు. బాలు మృతి తీరని లోటని... ప్రధాన అర్చకులు అర్జున శర్మ తెలిపారు.

విశాఖ జిల్లా..

డైమండ్ హిట్స్ బాలు రజతోత్సవ వేడుకలు
బాలు స్మృతులు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించారనే వార్త ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. ఆయనకు అనకాపల్లితో విడదీయరాని అనుబంధం ఉంది. అనకాపల్లికి మూడు పర్యాయాలు ఆయన వచ్చారు. 1970లో ఒక వివాహ కార్యక్రమంలో కచేరి ఇచ్చేందుకు వెళ్లారు. ప్రముఖ సాంస్కృతిక సంస్థ డైమండ్ హిట్స్ బాలు రజతోత్సవ వేడుకలను 19 92లో ఘనంగా నిర్వహించింది. సంస్థ వ్యవస్థాపకులు మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సినీ దర్శకుడు కోడి రామకృష్ణ పాల్గొన్నారు.

బాలుకు సన్మానం
డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణ జూనియర్ కళాశాలను ప్రారంభోత్సవంలో బాలు
బాలుతో సినీ నటులు రావుగోపాలరావు రావు

ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యంకి గాన గంధర్వ బిరుదు ప్రధానంచేయగా.... సంస్థ తరఫున సినీ నటులు రావుగోపాలరావు రావు దంపతులు బిరుదును అందజేశారు. ఎల్లా వెంకటేశ్వరరావు కచేరిని ఏర్పాటు చేశారు. అదేరోజు వీరభద్ర ఆధ్వర్యంలో నెలకొల్పిన డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణ జూనియర్ కళాశాలను ప్రారంభించారు. రెండు దశాబ్దాల క్రితం కొణతాల మోహన్ అనే యువకుడు పట్టణంలోని ఒక థియేటర్లో బాలు బృందంచే కచేరీ ఏర్పాటు చేశారు. బాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటని ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. అనకాపల్లి నెహ్రూచౌక్ వద్ద బాలు ఆర్కెస్ట్రా సభ్యులు సంతాప సభ నిర్వహించారు.

డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణ జూనియర్ కళాశాలకు రిబ్బను కట్ చేస్తున్న ఎస్పీబీ

కడపజిల్లా..

బాలుకు నివాళులు
ఎస్పీ బాలసుబ్రమణ్యంకు నివాళులు


ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం చిత్ర పరిశ్రమకు, బాలు అభిమానులకు తీరని లోటని కడప తెదేపా ఇంఛార్జ్ అమీర్ బాబు అన్నారు. కడపలో బాలు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడిన మహాగాయకుడు బాలు అని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి నేడు మన మధ్య లేకపోవడం బాధాకరమని తెలిపారు. ఎన్నో అవార్డులు అందుకొని ప్రపంచ దేశాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. బాలు లాంటి గాయకుడు ఇక రాలేరని అన్నారు.

ఇదీ చూడండి.

మూలాలు గుంటూరులో.. స్థిరపడింది నెల్లూరులో

ABOUT THE AUTHOR

...view details