ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 6, 2020, 10:15 AM IST

ETV Bharat / state

మూడు నెలలైనా వాడిపోని పూలు చూశారా....

విజయవాడలో రాష్ట్ర స్థాయి పుష్ప ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. ప్రదర్శనలో చామంతులు, ఆర్కిడ్స్ పూలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

state level flower show in vijayawada
రాష్ట్ర స్థాయి పుష్ప ప్రదర్శన

రాష్ట్ర స్థాయి పుష్ప ప్రదర్శన

మెుక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర స్థాయి పుష్ప ప్రదర్శన ఆకట్టుకుంది. విజయవాడ వేదికగా జరిగిన ప్రదర్శనలో చామంతులు, ఆర్కిడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
20 రకాల హైబ్రిడ్ చామంతులు..
సహజంగా తెలుపు, నలుపు రంగు చామంతి పూలనే మనం ఎక్కువుగా చూస్తుంటాం. కానీ పుష్ప ప్రదర్శనలో ఏర్పాటు చేసిన 20 రంగుల హైబ్రిడ్ చామంతులు సందర్శకులకు కనువిందు చేశాయి. వీటిని తక్కువ బరువు ఉండే ప్లాస్టిక్ కుండీల్లో మట్టి లేకుండా కేవలం కొబ్బరికాయ పొట్టుతో పెంచుకోవచ్చునని నిర్వహకులు వివరించారు. రోజు విడిచి రోజు నీళ్లు పోస్తూ వారానికి ఒకసారి ఎరువు వేస్తే సరిపోతుందని చెప్పుకొచ్చారు.
ఆకట్టుకున్న ఆర్కిడ్స్...
ఎంతో అందగా ఉండే ఆర్కిడ్స్ సందర్శకుల మనసులు దోచాయి. డెన్ద్రోబియం రకానికి చెందిన ఈ ఆర్కిడ్స్ ఏడాది పొడవునా పూలు పూస్తుంటాయని నిర్వాహకులు తెలిపారు. ఒక్కో రెమ్మకు పూచిన పూలు మూడు నెలల వరకు అలాగే ఉంటాయిన్నారు. వీటి నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటమే కాకుండా విజయవాడ వాతావరణానికి ఎంతో అనుకూలమైనవిగా వివరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details