రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ఒక్కొక్కరుగా తరలివస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు నుంచి ప్రముఖులు వస్తున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వచ్చారు. స్టాలిన్‌కి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పలువురు వైకాపా అధినేతలు స్వాగతం పలికారు. విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో కొంతసేపు విశ్రాంతి తీసుకొని అనంతరం జగన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకానున్నారు.
విజయవాడ చేరుకున్న డీఎంకే అధినేత స్టాలిన్ - జగన్
డీఎంకే అధినేత స్టాలిన్ విజయవాడ చేరుకున్నారు. వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గన్నవరం విమానాశ్రయంలో స్టాలిన్‌కు స్వాగతం పలికారు.
డీఎంకే అధినేత స్టాలిన్