కృష్ణా జిల్లా నందిగామలోని తితిదే కళ్యాణ మండపంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలను విజయవాడ తితిదే సూపరింటెండెంట్ యస్.శోభారాణి ప్రారంభించారు. భక్తులు నందిగామలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపానికి బారులు తీరారు. నందిగామ పరిసర గ్రామాల ప్రజలేకాక .. తెలంగాణలోని సూర్యాపేట, కోదాడ, మధిర తదితర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు.
లడ్డూ ప్రసాదం కొనుగోలు చేశారు. ఒక్కో లడ్డూ ధర రూ .25 చొప్పున విక్రయించారు. కేవలం 3 గంటల వ్యవధిలో 10,000 లడ్డూలు విక్రయించినట్టు నిర్వాహకులు తెలిపారు. లడ్డూల కోసం ఇంకా భక్తులు వేచి చూస్తున్నారు.