విజయవాడలో శ్రీశ్రీ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రీశ్రీ విగ్రహానికి పలువురు సాహితీవేత్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీశ్రీ సాహిత్య నిధి ప్రచురించిన పుస్తకాలను ఆవిష్కరించారు. కవిత్వం తీరని దాహం అంటూ.. కదం తొక్కుతూ.. పదం పాడుతూ... మరో ప్రపంచం వైపు కవితను.. యువతను నడిపించిన యువకవిగా శ్రీరంగం శ్రీనివాసరావును సాహితీవేత్తలు అభివర్ణించారు.
విజయవాడలో ఘనంగా శ్రీశ్రీ జయంతి వేడుకలు - krishna
అభ్యుదయ కవిత్వానికి, విప్లవ కవిత్వానికి ఆద్యుడైన శ్రీశ్రీ 109వ జయంతి వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించారు.
శ్రీశ్రీ జయంతి వేడుకలు