మహాప్రస్థానం... తెలుగుజాతిని ఉర్రూతలూగించిన మహాకావ్యం. తన పుస్తకాన్ని నిలువుటద్దం సైజులో చూసుకోవాలని మహాకవి శ్రీశ్రీ ఆశించారట. ఆయన కలను నిజం చేసే క్రమంలో అంత పెద్దగా కాకున్నా అందులో సగం సైజులో ‘శ్రీశ్రీ మహాప్రస్థానం... మొదలైన గీతాలు’ అనే పేరిట భారీ పుస్తకాన్ని ప్రచురించారు. ‘సాహితీ మిత్రులు’ పక్షాన ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని మొగల్రాజపురం, సిద్ధార్థ ఆడిటోరియంలో పుస్తకానికి నీరాజనం కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ఆత్మీయ మిత్రులుగా ఏపీఎస్‌ఆర్టీసీ ఎం.డి. ద్వారకా తిరుమలరావు, ఏపీ పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు విచ్చేయనున్నారని, ప్రముఖులు కె.శివారెడ్డి, ఎన్.వేణుగోపాల్, వాసిరెడ్డి నవీన్, ఓల్గా, జంపాల చౌదరి, మాడభూషి శ్రీధర్, ఐపీఎస్ అధికారులు కిల్లాడ సత్యనారాయణ, సతీష్‌చంద్రలు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈమేరకు సాహితీప్రియులందరికీ ఆహ్వానం పలికారు.
మహాకవి శ్రీశ్రీకి నిలువెత్తు నీరాజనం
శ్రీశ్రీ అందించిన అద్భత కావ్యం మహప్రస్థానం. ఆయన రచించిన మరెన్నో కావ్యాలు, గీతాలతో ఓ భారీ పుస్తకాన్ని ప్రచురించారు. నేడు విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
మహాకవి శ్రీశ్రీ