ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'క్రీడలతో మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు'

మానసిక ఒత్తిడిని అధిగమించడానికి క్రీడలు మంచి వ్యాయామంగా పని చేస్తాయి. అసెంబ్లీ ఉద్యోగులు కూడా ఆ అలసటను తొలగించుకోవడానికి వార్షిక క్రీడా పోటీలను నిర్వహించుకుంటున్నారు. ఈ పోటీలను ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు అవంతి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పేర్ని వెంకట్రామయ్య, కొడాలి వెంకటేశ్వరరావు ప్రారంభించారు.

By

Published : Aug 27, 2019, 12:32 AM IST

అసెంబ్లీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలను రాష్ట్ర మంత్రులు

అసెంబ్లీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలను రాష్ట్ర మంత్రులు

విజయవాడలోని వెలగపూడి సచివాలయంలో అసెంబ్లీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలను రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు. ప్రభుత్వం-మనది అనే భావనతో ఉద్యోగులు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. క్రీడలు మానసికోల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని...ముఖ్యమంత్రి ఉద్యోగుల పట్ల అంకిత భావంతో ఉన్నారని తెలిపారు. ప్రతి ఉద్యోగి నెలకొక మొక్క నాటి... సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు అవంతి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పేర్ని వెంకట్రామయ్య, కొడాలి వెంకటేశ్వరరావు కోరారు. రాష్ట్రంలోని 1,500కి పైగా సచివాలయ ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనడం ఇతర ఉద్యోగులకు పరోక్షంగా ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details