ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓవైపు చెట్ల తొలగింపు.. మరోవైపు ఉద్యానవనం - విజయవాడ తాజా వార్తలు

క్రమంగా పెరుగుతున్న పట్టణీకరణ.... విజయవాడలోని పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ తరుణంలో బెంజి సర్కిల్‌ పైవంతెన రెండోదశ నిర్మాణంలో భాగంగా ఓవైపు చెట్లు తొలగిస్తుంటే... మరోవైపు ఉద్యానవనం సిద్ధం చేస్తున్నారు. వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు.

green belt
ఓవైపు చెట్ల తొలగింపు.. మరోవైపు ఉద్యానవనం

By

Published : Oct 28, 2020, 6:11 PM IST

విజయవాడలోని బెంజి సర్కిల్‌ వద్ద రెండోదశ పైవంతెన నిర్మాణ పనులు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా బెంజి సర్కిల్ నుంచి మహానాడు సర్కిల్ వరకూ చెట్లు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పైవంతెన కింద రూ. 3 కోట్లతో ఉద్యానవనం ఏర్పాటు కానుంది. వీఎమ్​సీ, ఎన్​హెచ్​ఏఐ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి.

అభివృద్ధి పేరిట భారీ వృక్షాలను తీసి అలంకరణ మొక్కలు పెంచడం సరికాదని పర్యావరణవేత్తలు వాదిస్తున్నారు. రూ. 2.75 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఉద్యానవనం నిర్మిస్తుండగా... బాధ్యతలను విజయవాడ నగరపాలక సంస్థ పర్యవేక్షిస్తోంది. స్థలం తక్కువ ఉన్నందున... hfల్లలు ఆటలు ఆడుకునే పరికరాలను ఏర్పాటు చేయడం లేదు.

రెండో దశ నిర్మాణంలో భాగంగా తొలగిస్తున్న చెట్ల విషయంలో ప్రత్యామ్నాయాలు ఆలోచించి... తమకు అవసరమైన వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ప్రస్తుత పైవంతెన పార్కుకు సంబంధించి నవంబర్ 3న టెండర్లు తెరవనున్నారు. వేసవిలోగా కొలిక్కి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఇవీ చదవండి:

'పంట నష్టంపై పారదర్శకంగా నివేదిక రూపొందిస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details